సినిమా హీరోలంటే జగన్‌కు కుళ్లు .. కార్లు ఆపేసి, తాడేపల్లి ప్యాలెస్‌లో నడిపించారు : పవన్ కళ్యాణ్


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రచారం ఊపందుకుంది. నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. 

Also Read : ఓటు ఫ్రమ్ హోమ్ : అర్హులెవరు, దరఖాస్తు ఎలా, ఓటు ఎలా వేయాలి..?

లక్షలాది మంది అభిమానులు వున్న సినీ హీరోలంటే జగన్‌కు కుళ్లు అంటూ మండిపడ్డారు. కలుగులో ఎలుక లాంటి జగన్ అది తట్టుకోలేరని దుయ్యబట్టారు. సినిమా టికెట్ ధరల పెంపు, ఇతర సమస్యల పరిష్కారం కోసం తాడేపల్లిలో సీఎం జగన్‌తో మాట్లాడేందుకు చిరంజీవి, ప్రభాస్ , మహేశ్ వెళ్లారని .. కానీ వారి వాహనాలను బయట ఎక్కడో ఆపేసి నడిపించారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. 

ప్రైవేటుగా మీటింగ్ జరుగుతుంటే.. సీక్రెట్‌గా కెమెరాలు, మైక్‌లు పెట్టి శాడిజం చూపించారని జనసేనాని ఎద్దేవా చేశారు. చిరంజీవి వారందరి తరపున మాట్లాడితే.. సదరు వీడియోలను బయటకు రిలీజ్ చేసి ఆయనను అగౌరవపరిచారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి అజాత శత్రువని.. ఆయన ఎవరి జోలికి వెళ్లరని, అలాంటి వ్యక్తిని కూడా జగన్ కించపరిచారని జనసేన  చీఫ్ ఫైర్ అయ్యారు. 

Also Read : ఎన్నికలొస్తే తెగ వినిపిస్తుంది .. అసలేంటీ ‘‘ బీ-ఫారం ’’..?

గతంలో ఎన్టీఆర్ సీఎంగా వున్నప్పుడు ఎంతో మంది నటులు వేరే పార్టీల్లో వుండేవారని.. ఆయనను రాజకీయంగా విమర్శించేవారని పవన్ గుర్తుచేశారు. కానీ రామారావు.. ఎప్పుడూ, ఎవరిని ఇబ్బంది  పెట్టలేదని అదీ ఆయన సంస్కారమన్నారు. టీడీపీతో గతంలో వ్యక్తిగతంగా విభేదాలు వున్నప్పటికీ తన సినిమాలను అడ్డుకోలేదని పవన్ తెలిపారు. 



Comments